- ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పలు స్టేషన్లకు వరుస ఫిర్యాదులు అందాయి. దీంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి పీడీయాక్ట్ నమోదు చేసి జైలుకు తరలించారు. అప్పటి నుంచే జైల్లోనే ఉన్నారు రాజా సింగ్. ఇప్పటికే ఈ విషయమై రాజాసింగ్ భార్య ఉషా బాయి కోర్టును ఆశ్రయించారు. అయినా ఫలితం లేపోవటంతో తాజాగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను కలిశారు. ‘దయచేసి మీరైనా రాజాను పట్టించుకోని ఈ కేసు నుంచి బయట పడేలా చూడాలని’ కోరారు.
ఆమె తన భర్త రాజాసింగ్‌పై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని సంజయ్‌ని విజ్ఞప్తి చేశారు. జాతీయ నాయకత్వానికి రాజాసింగ్ ఇంతకుముందే షోకాజ్ నోటీసులపై వివరణ ఇచ్చారని పేర్కొన్నారు. హిందూధర్మం కోసం పాటుపడుతున్నందుకే ఈ ప్రభుత్వం కక్షపూరితంగా జైల్లో పెట్టిందని ఆమె సంజయ్‌తో ఆవేదన వెలిబుచ్చినట్లుగా సమాచారం. అయితే సస్పెన్షన్ ఎత్తివేత అంశం జాతీయ నాయకత్వం చూసుకుంటుందని సంజయ్ తెలిపినట్లుగా సమాచారం.