రైతుబంధు స‌మితి రాష్ట్ర అధ్య‌క్షుడిగా ఎమ్మెల్యే తాటికొండ రాజ‌య్య‌

-

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగిన విషయం తెలిసిందే. నవంబర్ 30న ఎన్నికలు జరుగనున్నాయని.. డిసెంబర్ 03న ఫలితాలు ఉండటంతో.. ఇక పార్టీల నేతలు బిజీ అయ్యారు. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ పార్టీ పదవులను కట్టబెట్టేందుకు కసరత్తు చేస్తుంది. కొంత మంది సిట్టింగ్ లకు పదవులు కట్టబెడుతుంది. టికెట్ దక్కని వారికీ పదవులను అప్పజెప్పుతుది. ఇప్పటికే జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి టీఎస్ ఆర్టీసీ చైర్మన్ గా బాధ్యతలను అప్పగించింది. ఆ తరువాత తాజాగా స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు కి కూడా పదవీ అప్పగించింది. 

రైతుబంధు స‌మితి రాష్ట్ర అధ్య‌క్షుడిగా స్టేష‌న్ ఘ‌న్‌పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజ‌య్య బాధ్య‌తలు స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా రైతుబంధు స‌మితి అధ్య‌క్ష బాధ్య‌త‌లు క‌ట్ట‌బెట్టిన ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు రాజ‌య్య ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు. రాజ‌య్య‌కు ప‌లువురు రైతులు, స్థానికులు శుభాకాంక్ష‌లు తెలిపారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే టికెట్‌ను ఈసారి కడియం శ్రీహరికి కేటాయించిన నేపథ్యంలో రాజయ్యకు కార్పొరేషన్‌ పదవితో సముచిత ప్రాధాన్యం కల్పించారు. రాజయ్య రైతుబంధు స‌మితి అధ్య‌క్షుడిగా రెండేండ్ల పాటు కొన‌సాగ‌నున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news