సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో కేపీ వివేకానంద విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి అప్పుడప్పుడు ముఖ్యమంత్రి అనేది గుర్తుంచుకోవాలన్నారు. ఏది పడితే అది మాట్లాడుతాడు.. ఫుట్‌పాత్ గాళ్లు మాట్లాడినట్టు, లోఫర్, లఫంగ మాటలు మాట్లాడుతుండని ఆగ్రహించారు కేపీ వివేకానంద. ఇవన్నీ మాటలు ముఖ్యమంత్రి మాట్లాడకూడదు అనేది మా బాధ అన్నారు.
అటు సీఎం రేవంత్ రెడ్డి నువ్వు చంపితే చావడానికి నేను రెడీగా ఉన్నానని హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తనపై హత్యాయత్నం చేపించాడని పేర్కొన్నారు. కాంగ్రెస్ మంత్రి శ్రీధర్ బాబు ఏమో.. ఇద్దరూ బీఆర్ఎస్ నేతల మధ్య పంచాయితీనీ కాంగ్రెస్ ని లాగొద్దు అన్నారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి మావాళ్ల జోలికి వస్తే.. వీపు చింతపండు అయితది బిడ్డ. మా వాళ్లు ఎవ్వరి జోలికి పోరు అని నవ్వుకునేవిధంగా మాట్లాడారు అని కౌశిక్ రెడ్డి గుర్తు చేశారు. మహబూబ్ నగర్ లో నీ వీపు చింతపండు అయింది రేవంత్ రెడ్డి అంటూ వ్యంగాస్త్రాలు విసిరారు.