చంద్రబాబు సర్కార్ పై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని చురకలు అంటించారు ఏపీ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఎపీలో ప్రభుత్వం వచ్చి వంద రోజులు దాటిపోయిందని… ప్రజలకు ప్రభుత్వంపై ఫీల్ గుడ్ రాలేదన్నారు. ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతుందని.. ఇప్పటి వరకు బడ్జెట్ ప్రవేశపెట్టలేదని ఆగ్రహించారు. ప్రతిదానికీ గత ప్రభుత్వం పై నెపం నెడుతున్నారని… ప్రజలు సూపర్ సిక్స్ ఎక్కడ అనే ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.
మహిళలకు, వృద్ధులకు చెప్పిన పథకాలు కూటమి ప్రభుత్వం అమలు చేయడం లేదని… నెగెటివ్ ఫీలింగ్ ప్రజల్లో వచ్చేసిందని చురకలు అంటించారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే గ్రామాల్లో పార్టీల పేరుతో దాడులు చేశారని ఆగ్రహించారు. పోలవరం ఇపుడే నిర్మాణం జరుగుతుందనే భ్రమ కలిగించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. నాలుగు నెలల్లో ఎపి ప్రభుత్వం చేసిన అప్పుల వివరాలను మా ప్రభుత్వం నీ విమర్శించిన మీడియా ఇప్పుడు రాయడం లేదన్నారు. 2005లో పోలవరం పనులు ప్రారంభం కాగా… ఇప్పుడు చంద్రబాబు తానే ప్రారంభించినట్లు ప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు ఏపీ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.