వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నల్లగొండలో ప్రారంభమైంది. మొత్తం 52 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. అయితే, అందులో ప్రధాన పోటీదారులైన బీఆర్ఎస్ నుంచి రాకేష్రెడ్డి, కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న అలియాస చింతపండు నవీన్, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మధ్యే పోటీ ఉంది. మే 27న జరిగిన పోలింగ్లో దాదాపు 4,63,389 ఓట్లకు గాను 3,36,031 ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి.
ప్రస్తుతం 2,750 మంది సిబ్బందితో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా పోలైన ఓట్లను 25 ఓట్ల చొప్పున బండిల్స్ కట్టారు. అయితే, ప్రస్తుతం మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, అందులో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ముందంజలో ఉన్నట్లుగా తెలుస్తోంది. తరువాత స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్రెడ్డి ఉన్నట్లుగా సమాచారం. ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. మొదటి ప్రాధాన్యత ఓటు రాకేష్ రెడ్డి పెద్ద ఎత్తున పోల్ అయినప్పటికీ అవి చెల్లుబాటు కాలేదు. దీంతో రాకేష్ రెడ్డి కాస్త వెనుకబడినట్టు సమాచారం.