రాష్ట్రాల్లో భారత రాజ్యాంగం నడుస్తోందా.. బీజేపీ రాజ్యాంగమా..?: కవిత

-

నామినేటెడ్‌ కోటా ఎమ్మెల్సీల పేర్లను గవర్నర్‌ తిరస్కరించడంపై బీఆర్‌ఎస్‌ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ వ్యవహారంలో గవర్నర్ ప్రవర్తించిన తీరును తప్పు బడుతున్నారు. తమిళిసై గవర్నర్ పదవికి అనర్హురాలని.. ఆమె వెంటనే రాజీనామా చేయాలని ఇప్పటికే బీఆర్ఎస్ మంత్రులు డిమాండ్ చేశారు. తాజాగా గవర్నర్ వ్యవహారంపై ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత స్పందించారు.

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ప్రభుత్వం పంపిన జాబితాను ఆమోదించడం సంప్రదాయమని కానీ.. సర్కార్ పంపిన పేర్లను అనేక కారణాలు చెప్పి తిరస్కరించడం సబబు కాదని చెప్పారు. రాష్ట్రాల్లో భారత రాజ్యాంగం నడుస్తుందా.. లేక బీజేపీ రాజ్యాంగం నడుస్తుందా అని కవిత ప్రశ్నించారు.

“పలు రాష్ట్రాల్లో గవర్నర్ల వ్యవహార శైలిని ప్రజలు గమనిస్తున్నారు. గవర్నర్లే ఇలా వ్యవహరించడం దురదృష్టకరం. రాజ్యాంగ వ్యవస్థలకు పరిధులు, పరిమితులు ఉంటాయి. బీసీ వర్గాలకు మా పార్టీ పెద్దపీట వేస్తోంది. బీసీ వ్యతిరేక పార్టీ అని మరోసారి బీజేపీ నిరూపించుకుంది. గవర్నర్ తమిళిసై ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా గవర్నర్ వ్యవహరించారు. ప్రభుత్వం పంపిన జాబితాను ఆమోదించడం సంప్రదాయం. కానీ అనేక కారణాలు చెప్పి ఆ జాబితాను తిరస్కరించారు” అని కవిత మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news