గ్రూప్ 1 పరీక్షలపై ఎమ్మెల్సీ కోదండరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ లో ఎమ్మెల్సీ కోదండరాం అభినందన సభ జరిగింది. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ… గత బిఅరెస్ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేకపోయిందని తెలిపారు. గత ప్రభుత్వ విధానాల వలనే నిరుద్యోగుల సంఖ్య రెట్టింపు అయిందని ఆగ్రహించారు. గ్రూప్ 1 ఎగ్జామ్స్ మీద బిఅరెస్ కు మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.
గత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి తీసుకున్న చర్యలు, ఇచ్చి నోటిఫికేషన్లు, ఉద్యోగాల భర్తీ మీద ఎన్ని సార్లు అదిగిన వివరాలు ఇవ్వలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి చొరవ చూపుతోందని వివరించారు. జీవో 55, 29 ల అమలు వెనుక కోర్టు సూచనలున్నాయన్న సంగతి తెలుసుకోవాలన్నారు. తమ పార్టీ అప్పుడే, ఇప్పుడు నిరుద్యోగ సమస్యపై పోరాడుతూనే ఉందని తెలిపారు. తమ ఆందోళనలు, సూచనలను ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించిందని.. ఉద్యోగాల భర్తీ మీద బిఆరేస్ పార్టీ నేతలు అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. నిరుద్యోగులను బిఅరెస్ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది. దీన్ని సహించేది లేదన్నారు..