కోల్‌కతా ఆర్జీకర్ ఆస్పత్రిలో మెడికోపై అత్యాచారం, హత్య ఘటనను నిరసిస్తూ వైద్య విద్యార్థులు, డాక్టర్లు ఆమరణ దీక్షకు దిగిన విషయం తెలిసిందే. దీంతో జూనియర్ డాక్టర్లు దీక్ష విరమించి చర్చలకు రావాలని సీఎం మమత పిలుపునిచ్చారు. అయితే, తమ డిమాండ్లు నెరవేర్చేవరకు దీక్ష విరమించబోమని వారు తేల్చి చెప్పారు.కాగా, సోమవారం ప్రభుత్వంతో చర్చలు జరపడానికి వైద్యులు అంగీకరించారు.
ప్రస్తుతం 16వ రోజూ డాక్టర్ల దీక్ష కొనసాగుతోంది. దారుణంగా హత్యకు గురైన సహోద్యోగికి న్యాయం చేయాలని, రాష్ట్రంలోని ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక సదుపాయాల్లో వ్యవస్థాగతమైన మార్పులు తేవాలని జూడాలు డిమాండ్ చేస్తున్నారు. కాగా, డిమాండ్ల పరిష్కారానికి 3 నుంచి 4 నెలల సమయం ఇవ్వాలని సీఎం మమత కోరగా.. ఆ విజ్ఞప్తిని వైద్యులు నిరాకరించి దీక్ష కొనసాగించారు. అయితే , నిరాహారదీక్షలో ఉన్న ఆరుగురు వైద్యుల ఆరోగ్యం క్షీణించడంతో వారి ఆస్పత్రికి తరలించారు.మరో 8 మంది నిరవధిక నిరాహార దీక్షను కంటిన్యూ చేస్తున్నారు.