తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అలర్ట్.. మరో రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. రాగల రెండురోజులు తెలంగాణ రాష్ట్రంలోని పలుజిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్టోబర్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభమవుతుందని వెల్లడించింది.
హైదరాబాద్ తో సహా మొత్తం రాష్ట్రం సెప్టెంబర్ చివరివరకు సాధారణ వర్షపాతం ఉంటుందని, అక్టోబర్ ప్రారంభంలో వాతావరణం క్రమంగా మారుతుందని చెప్పింది. సోమవారం, మంగళవారాల్లో వివిధ జిల్లాల్లో నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేటతో పాటు పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అటు హైదరాబాద్ మహా నగరం లో కూడా వ్యర్ధాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ తరుణం లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.