యూరియాపై సబ్సిడీ పొడగింపు..కేంద్రానికి బండి సంజయ్‌ ధన్యవాదాలు

-

దేశంలోని రైతాంగానికి రూ.3,68,677 కోట్ల రూపాయల విలువైన యూరియా సబ్సిడీని మరో 3 ఏళ్లపాటు కొనసాగిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మకం అన్నారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. అట్లాగే రైతుల పెట్టుబడిని తగ్గించేందుకు సల్ఫర్ పూత కలిగిన యూరియాను ప్రవేశపెడుతున్నట్లు కేంద్రం ప్రకటించడం హర్షణీయం.

దీనివల్ల పంట దిగుబడి అధికమయ్యే అవకాశముందని చెప్పారు. దీంతో పాటు చెరుకు మద్దతు ధరను టన్నుకు 3,150 లు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. తాజా నిర్ణయాలతో మోదీ ప్రభుత్వం రైతు పక్షపాతి అని మరోసారి నిరూపితమైందని చెప్పారు. తాజా నిర్ణయంతో 5 కోట్ల మంది చెరుకు రైతులకు మేలు జరుగుతుంది. అంతేగాకుండా చెరుకు పంటపై ఆధారపడే లక్షలాది మంది కార్మికులకు ప్రయోజనం కలుగుతుందని…తెలంగాణ రైతాంగం పక్షాన నరేంద్రమోదీ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు బండి సంజయ్ కుమార్.

Read more RELATED
Recommended to you

Exit mobile version