తెలంగాణ అభివృద్ధికి మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉంది – కిషన్ రెడ్డి

-

తెలంగాణ అభివృద్ధికి మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు కేంద్రమంత్రి, తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. వందే భారత్ రైళ్ల ప్రారంభం సందర్భంగా కాచిగూడ రైల్వే స్టేషన్ ను సందర్శించారు కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ భారతదేశానికి ప్రధాని అయిన తర్వాత రైల్వే రంగంలో అత్యధిక మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. రవాణా రంగంలో దేశీయ టెక్నాలజీతో ముందుకు వెళుతున్నామని తెలిపారు.

వినాయక నవరాత్రుల సందర్భంగా తెలంగాణకు మూడో వందే భారత్ రైలు రాబోతుందని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధిలో మోడీ ప్రభుత్వం అంకితభావంతో ముందుకు వెళుతుందన్నారు. ఇక పోటీ పరీక్షల నిర్వహణలో టిఎస్పిఎస్సి పూర్తిగా విఫలమైందని విమర్శించారు. దీని వెనుక సీఎం కేసీఆర్ కుట్ర ఉందని ఆరోపించారు. ప్రభుత్వ విధానాల వల్ల నిరుద్యోగులు తీవ్ర నిరాశకు గురవుతున్నారని.. కోర్టులు ఎన్నిసార్లు మొట్టికాయలు వేస్తున్నా పారదర్శకంగా పరీక్షలు ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు.

అప్పులు చేసి నిరుద్యోగులు కోచింగ్ తీసుకున్నారని.. మొదటిసారి గ్రూప్ 1 పరీక్ష పేపర్ లీక్ అయ్యి అభ్యర్థులు ఆగమయ్యారు, నిన్న హైకోర్టు మళ్లీ పరీక్షను రద్దు చేసిందని, దీనికి సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ అభ్యర్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు.

మరోవైపు అక్టోబర్ 1న మోడీ హైదరాబాద్, మహబూబ్నగర్ లో జరిగే కార్యక్రమాలలో పాల్గొంటారని తెలిపారు కిషన్ రెడ్డి. హైదరాబాద్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారని తెలిపారు. సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ ను ప్రధాని మోదీ ప్రారంభిస్తారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news