ఇవాళ తెలంగాణకు మోడీ…తెలుగులో అదిరిపోయే ట్వీట్‌

-

ఇవాళ తెలంగాణకు ప్రధాని మోడీ రానున్నారు. ఈ నేపథ్యంలోనే… తెలుగులో ట్వీట్‌ చేశారు ప్రధాని మోడీ. నేడు… ఫిబ్రవరి 4వ తేదీన తెలంగాణ ప్రజల మధ్య గడిపేందుకు నేను ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానన్నారు ప్రధాని మోడీ. ఆదిలాబాద్‌లో జరిగే కార్యక్రమంలో రూ.56,000 కోట్ల విలువగల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలని, శంకుస్థాపనలను చేస్తానని వివరించారు.

ఆ తర్వాత తెలంగాణ బీజేపీ పార్టీ నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తాను. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ పెద్ద ఎత్తున బీజేపీకి మద్దతివ్వబోతోందని వెల్లడించారు ప్రధాని మోడీ.

ప్రధాని మోడీ షెడ్యూల్‌
10.20 గంటలకు ఆదిలాబాద్ కు చేరుకోనున్నారు ప్రధాని మోడీ. 10.30 గంటలకు స్టేడియంకు వస్తారు. 11 గంటల వరకు అధికారిక కార్యక్రమాలు ఉంటాయి. 11.15 నుంచి 12 గంటల వరకు బహిరంగలో ప్రధాని మోడీ పాల్గొంటారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news