నేడు జనగామ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ అభివృద్ధి పనులను వర్చువల్ ద్వారా ప్రారంభించనున్నారు ప్రధాన మంత్రి మోడీ. జనగామ రైల్వే స్టేషన్ అభివృద్ధి కొరకు మొత్తం రూ.100 కోట్లు కేటాయించింది కేంద్రం. మొదటి విడతగా రూ. 24.50 కోట్లు విడుదల చేసింది.
ఇందులో భాగంగానే నేడు ఉదయం 9.30 గంటలకు ఢిల్లీ నుంచి వర్చువల్ ద్వారా ప్రధాన మంత్రి మోడీ ప్రారంభించనున్నారు. ప్రధాని మోడీ కార్యక్రమాన్ని ప్రజలు తిలకించే విధంగా స్టేషన్ ఆవరణలో భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు అధికారులు. ఇక ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి హాజరుకానున్నారు.