మోహన్ బాబు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైకోర్టులో మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. తనకి పోలీసులు జారీ చేసిన నోటీసుని సవాలు చేశారు మోహన్ బాబు. తన ఇంటి వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇవ్వాలని కోరారు మోహన్ బాబు.
తాను సెక్యూరిటీ కోరినా భద్రత కల్పించలేదని, వెంటనే తనకు భద్రత కల్పించాలని పిటిషన్ వేశారు మోహన్ బాబు. మోహన్ బాబు తరఫున పిటిషన్ దాఖలు చేసారూ సీనియర్ న్యాయవాదులు నగేష్ రెడ్డి, మురళీ మనోహర్.
మోహన్ బాబు నివాసం దగ్గర జరిగిన మీడియాపై దాడి ఘటనపై పోలీస్ శాఖ సీరియస్ అయింది. మోహన్ బాబు చుట్టూ ఉన్న బౌన్సర్లను బైండోవర్ చేయాలని తెలంగాణ పోలీస్ శాఖ ఆదేశాలు ఇచ్చింది. బౌన్సర్లతో పాటూ మోహన్ బాబు విష్ణు దగ్గర ఉన్న గన్లను డిపాజిట్ చేయాలని అదేశాలు ఇచ్చింది.