డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు మల్లికార్జునరావుపై FIR నమోదు చేసిన మంగళగిరి పోలీసులు… విచారించారు. నిన్న నిందితుడిని గంట పాటు విచారించారు పోలీసులు. నిందితుడు మద్యం మత్తులో ఆకతాయిగా బెదిరింపు కాల్ చేసినట్లుగా గుర్తించారు పోలీసులు.
ఏపీ డిప్యూటీ సీఎం కార్యాలయం ఫిర్యాదు మేరకు 509, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాగా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తి మొన్న అరెస్ట్ అయ్యాడు. గంటల వ్యవధిలోనే విజయవాడలో అరెస్ట్ అయ్యాడు. నిందితుడిని మల్లికార్జున రావుగా గుర్తించారు లబ్బిపేట పోలీసులు. డిప్యూ సీఎం పేషీకి బెదిరింపు కాల్స్ గురించి డీజీపీతో మాట్లాడిన హోం మంత్రి వంగలపూడి అనిత… నిందితుడి నుంచి రెండు ఫోన్స్ కాల్స్ వచ్చాయని అనితకు వివరించారు డీజీపీ.