రైతులకు గుడ్ న్యూస్.. ఈ వానాకాలం సీజన్‌ఆశాజనకంగా ఉంటుందన్న వ్యవసాయ శాఖ

-

రాష్ట్రంలో వానాకాలం సీజన్‌ ఆశాజనకంగా ఉంటుందని వ్యవసాయ శాఖ తెలిపింది. నిరుడు సాగైన 140 లక్షల 74వేల ఎకరాల సాగుతో పోలిస్తే ఈయేడు 11 లక్షల 19 వేల ఎకరాల్లో సాగు అధికంగా ఉంటుందని పేర్కొంది. మొత్తంగా 151 లక్షల పై చిలుకు ఎకరాల్లో పంటలు సాగవుతాయని వెల్లడించింది. అందులో 66లక్షల ఎకరాల్లో వరి, 55లక్షల ఎకరాల్లో పత్తి వేస్తారని అంచనా వేసింది.

నైరుతి రుతుపవనాలు జూన్‌ 7,8 తేదీల్లో రాష్ట్రంలో ప్రవేశిస్తాయని పేర్కొంది. వేరుసెనగ మినహా ఇతర అన్ని పంటల విస్తీర్ణంలో పెరుగుదలను చూపింది. వరి నిరుటి కంటే 5,748 ఎకరాలు పెరగనుండగా పత్తి ఏకంగా 10,07,526 ఎకరాల్లో అధికంగా సాగవుతుందని వెల్లడించింది. మొక్కజొన్న 67,003 ఎకరాలు, ఆయిల్‌పామ్‌ 66,178, సోయా 42,068, జొన్న 8,446, మిరప 5,808 ఎకరాలు పెరుగుతుందంది. వేరుసెనగ 844 ఎకరాలు, మామిడి తోటల పెంపకం 14,141 ఎకరాలు తగ్గుతుందని తెలిపింది. ఈ మేరకు వానాకాలం సీజన్‌ కార్యాచరణ ప్రణాళికను వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు మంగళవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెట్టగా దానికి ఆమోదం లభించింది. ప్రణాళిక మేరకు పంటలు సాగేయ్యేలా చూడాలని అధికారులను మంత్రిమండలి ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news