హెలికాప్టర్లతో రెస్క్యూ ఆపరేషన్.. మోరంచపల్లి గ్రామస్థులు సేఫ్​

-

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతున్నాయి. వర్షాలు, వరదలపై ప్రగతి భవన్​ నుంచి సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా  పూర్తిగా నీట మునిగిన భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామంలో సహాయక చర్యల కోసం హెలికాప్టర్లను పంపాలని సీఎస్​ శాంతికుమారిని ఆదేశించారు.

సీఎం ఆదేశాలతో ముంపునకు గురైన మోరంచపల్లి గ్రామానికి సీఎస్ శాంతికుమారి రెండు సైనిక హెలికాప్టర్లను పంపారు. సహాయక చర్యల్లో సాధారణ హెలికాప్టర్ల వినియోగం ఇబ్బందిగా మారతాయన్న ఆలోచనతో సికింద్రాబాద్​ కంటోన్మెంట్​లోని మిలటరీ అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపి.. ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు సీఎం ఆదేశాలతో ఎన్డీఆర్​ఎఫ్​ బృందాలు రంగంలోకి దిగాయి. ముంపు ప్రాంతం నుంచి మోరంచపల్లి గ్రామస్థులను సురక్షిత ప్రాంతానికి తరలించాయి. బోట్లలో పునరావాస కేంద్రానికి తరలించారు. వరదలో చిక్కుకున్న ఆరుగురిని హెలికాప్టర్‌ ద్వారా కాపాడారు. ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరో మూడ్రోజుల వరకు వర్షాలు ఉన్నాయని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news