కేసీఆర్ అవకాశం ఇస్తే..ఎక్కడైనా గెలిచే సత్తా నాకు ఉంది – మోత్కుపల్లి

-

కేసీఆర్ అవకాశం ఇస్తే..ఎక్కడైనా గెలిచే సత్తా నాకు ఉందన్నారు మోత్కుపల్లి నరసింహులు. ఇవాళ మీడియాతో మోత్కుపల్లి నరసింహులు మాట్లాడుతూ.. పుట్టిన రోజు సందర్భంగా లక్ష్మి నరసింహ స్వామీ వారిని దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నానని.. 30 సంత్సరకాలంగా 6సార్లు ఎమ్మెల్యేగా ప్రతీ ఇంటిలో నేను ఉన్నానని తెలిపారు.

నరసింహులు మాట ఇస్తే నూటికి నూరుశాతం పని పూర్తి. ప్రజలలో నాయకుడికి ఎప్పుడు ఓటమి ఉండదని వెల్లడించారు. NTR నా రాజకీయ భవిష్యత్ దేవుడు దళితుని అయిన నేను అన్ని వర్గాల వారినీ అక్కున చేర్చుకున్నానని.. పేదొడిన గెలిచిన వాడికి ఓటమి లేదన్నారు. యాదాద్రి గర్భగుడి లోకి ప్రవేశం దళితుడిని అయినా నాతోనేనని.. 30 సంవత్సరాల రాజకీయలో కేసు లేకుండా ఉన్న ఏకైక వ్యక్తిని నేను అని తెలిపారు. బ్రతికినంత కాలం కేసిఆర్ సారథ్యంలోనే కొనసాగుతానని. వచ్చే ఎన్నికలలో బీఅర్ఎస్ దే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version