ఆనంద్ దేవరకొండ మూవీ పై అనసూయ ట్వీట్..ఏమన్నదంటే..?

-

గత కొద్ది రోజులుగా హీరో విజయ్ దేవరకొండ అంటే మండిపడే అనసూయ ఇవాళ ఆయన తమ్ముడు ఆనంద్ దేవరకొండ చిత్రం బేబీ గురించి ట్వీట్ చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది. ఇకపోతే లైగర్ సినిమా విడుదలైన రోజు నుంచి అనసూయ హీరో విజయ్ దేవరకొండను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అనసూయకు విజయ్ దేవరకొండ అభిమానులకు పూర్తిస్థాయిలో సోషల్ మీడియాలో వార్ నడిచింది. విజయ్ దేవరకొండను కావాలనే టార్గెట్ చేసినట్లుగా కూడా ఇటీవల అనసూయ ఓపెన్ అయిన విషయం తెలిసిందే. అయితే అలాంటి ఈమె ఆయన తమ్ముడు ఆనంద్ దేవరకొండ చిత్రానికి మద్దతుగా నిలిచింది.

ఇటీవలే ఈ సినిమా చిత్ర ట్రైలర్ ను విడుదల చేయగా దీనిపై పాజిటివ్ కామెంట్లు చేసింది.” కొంచెం లేటుగా స్పందించాను.. అయినా పర్వాలేదు.. ట్రైలర్ మనసుకు బాగా హత్తుకుంది.. ఇందులో డైలాగ్స్ ఒరిజినాలిటీని కదిలించాయి.. ఇక ఈ టీం అందరికీ నా బెస్ట్ విషెస్.. నాకు తెలిసిన వాళ్ళ కథలాగే అనిపిస్తోంది” అంటూ ట్వీట్ చేసింది ఈ ముద్దుగుమ్మ.. ఇకపోతే విజయ్ దేవరకొండ తో వివాదం నేపథ్యంలో తమ్ముడు ఆనంద్ దేవరకొండ సినిమాపై అనసూయ పాజిటివ్ కామెంట్ ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఇకపోతే విజయ్ దేవరకొండ దగ్గర పని చేసే ఒక వ్యక్తి డబ్బులు ఇచ్చి మరీ తనపై దుష్ప్రచారం చేయించాడు అంటూ అనసూయ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. విజయ్ కి తెలియకుండానే ఆ వ్యక్తి నన్ను టార్గెట్ చేసాడని నేను అనుకోను.. ఆ విషయం తెలిసాక మరింత బాధపడ్డాను అంటూ అనసూయ చెప్పుకొచ్చింది. మొత్తానికైతే ఆనంద్ దేవరకొండ సినిమాపై ఈమె చేసిన పాజిటివ్ కామెంట్ ఇప్పుడు వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version