హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో అధికార కాంగ్రెస్ పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి ధీటుగా బదులు ఇచ్చారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ రజతోత్సవ సబ అట్టర్ ప్లాప్ అయిందని కామెంట్ చేసారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని రకాల సంక్షేమ పథకాలు గడపగడపకు చేరుతున్నాయని, వాటితో ప్రజలకు సంతృప్తికరంగా ఉన్నారని తెలిపారు.
రాష్ట్రంలో పదేల్ల పాటు కేసీఆర్ నియంతృత్వ పాలనను కొనసాగించారని.. ఆ విసయం బీఆర్ఎస్ లో మంత్రులుగా పని చేసిన వాళ్లకు తెలియదా.. అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ ది మాటల ప్రభుత్వం అని కాంగ్రెస్ ది చేతల ప్రభుత్వం అని అన్నారు. స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో నేడు ప్రజాస్వామ్య పాలన కొనసాగుతోందని తెలిపారు. కేసీఆర్ పాలమూరు ప్రాజెక్ట్ పనులను 80 శాతం పూర్తి చేశారని నిరూపిస్తే.. తాను ఎంపీ పదవీ రాజీనామా చేసి ముక్కు నేలకు రాస్తానని కేసీఆర్ కు ఎంపీ మల్లు రవి సంచలన సవాల్ విసిరారు.