దక్షిణాదినా బీజేపీ జెండా ఎగురేస్తాం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

-

ఎప్పుడూ ఎన్నికలు వచ్చినా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎగురవేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. విజయవాడలో పర్యటించి.. అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో ప్రసంగించారు. మోడీ నాయకత్వంలో దక్షిణ భారతదేశానికి ఎలాంటి అన్యాయం జరుగబోదన్నారు. రాబోయే రోజుల్లో ఇక్కడి ప్రజలకు మేలు చేసి.. వారి గుండెల్లో చోటు సంపాదించి దక్షిణాదిన బీజేపీ జెండా ఎగురవేస్తామన్నారు.

గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రిలయన్స్, అదానీ, టాటా వచ్చారని.. వారి చేతిలోనే దేశ సంపద ఉందని ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పడం శోచనీయం అన్నారు. మొదటిసారి మోడీ ప్రధాని అయిన తరువాత రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన అభివృద్ధి పోటీ వచ్చిందని.. దీనిని చూసి ఓర్వలేక కాంగ్రెస్, కమ్యూనిస్టులు బీజేపీ పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఆరోపించారు. భారతదేశం కులం, మతం పేరిట విడిపోవాలని ఆయన ఎప్పుడూ కోరుకోలేదన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news