సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ రఘునందన్ రావు కౌంటర్

-

భారత ప్రధాని నరేంద్ర మోడీ పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రధాని మోడీ బీసీ కాదని.. లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని పేర్కొన్నారు. 2002 వరకు మోడీ ఉన్నత కులాల్లో ఉండేవారన్నారు. గుజరాత్ సీఎం అయిన తరువాత తన కులాన్ని బీసీల్లో కలిపారని ఆరోపించారు. తానేమీ ఆషామాషీగా చెప్పడం లేదని.. అన్ని తెలుసుకునే మోడీ కులం గురించి మాట్లాడుతున్నానని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు మెదక్ ఎంపీ రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు. మోడీ గురించి మాట్లాడే హక్కు ధైర్యం రేవంత్ కి ఎక్కడిది అన్నారు. రేవంత్ రెడ్డి కేబినెట్ ఉన్నది ఇద్దరే బీసీలు అన్నారు. మోడీ కేబినెట్ లో 17 మంది బీసీలు ఉన్నారని తెలిపారు. ఎవరు బీసీ వ్యతిరేకి అని ప్రశ్నించారు రఘునందన్ రావు. అలాగే కాంగ్రెస్ అగ్రనేత  రాహుల్ గాంధీ కులం ఏంటో రేవంత్ చెప్పాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news