ములుగు ఎన్కౌంటర్ పై జిల్లా ఎస్పీ వివరణ..!

-

ములుగు జిల్లా చల్పాక ఎన్కౌంటర్ పై ఎస్పీ కీలక కామెంట్స్ చేసారు. కొద్దీ రోజుల క్రితం వాజెడు లో ఇన్ ఫార్మర్ నెపంతో ఇద్దరు అమాయక ప్రజలను మావోయిస్టులు హత్య చేయడం జరిగింది. అటువంటి కఠినతరమైన చర్యలను అరికట్టడం కోసం చల్పాక అడవిలో పెట్రోలు నిర్వహించాం. ఈరోజు ఉదయం పెట్రోలింగ్ చేస్తున్న 06:15 సమయంలో 10 నుంచి 12 మంది మావోయిస్టులు పోలీసులకు కనిపించారు. మావోయిస్టులను వెంటనే సరెండర్ కావలసిందిగా పోలీస్ వారు అభ్యర్థించారు. కానీ పోలీసుల అభ్యర్థనను వినిపించుకొని మావోయిస్టులు, పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు కూడా మావోయిస్టులపై కాల్పులు చేయడం జరిగింది.

దాదాపు అరగంటసేపు పోలీసులకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు చనిపోవడం జరిగింది. మరి కొంతమంది పారిపోయారు. చనిపోయిన మావోయిస్టు దగ్గర నుంచి రెండు ఏకే – 47 లతో పాటు భారీ మొత్తంలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాం అని జిల్లా ఎస్పీ శబరీష్ పేర్కొన్నారు. అలాగే దయచేసి మావోయిస్టులను లొంగిపోండన్న జిల్లా ఎస్పీ.. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం నుంచి పునరావాసం కల్పిస్తామన్నారు. జనజీవన స్రవంతిలో కలిసి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలన్న జిల్లా ఎస్పీ చనిపోయిన మావోయిస్టులలో ఇద్దరు ముగ్గురుని గుర్తించాము.. ఇంకా కొంతమందిని గుర్తించాల్సి ఉంది అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news