ఇచ్చిన మాట ప్రకారం సన్న బియ్యానికి 500 రూపాయల బోనస్ వేసాం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో వరి వేసుకుంటే ఉరే అని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆ పరిస్థితి నుంచి వరి వేసుకుంటే.. అందులో సన్నాలు వేసిన వారికి 500 రూపాయల బోనస్ ఇచ్చాము. ఉచిత కరెంటు ఇస్తామని చెప్పి ఇచ్చాము. ఎవరు వచ్చినా ఉచిత విద్యుత్ ఇవ్వక తప్పని పరిస్థితి. ఇక రాబోయే రోజుల్లో కూడా సన్నాలము బోనస్ కొనసాగుతోంది.
తెలంగాణ లో తెలంగాణ సోనా, బిపిటి, హెచ్ఏంటీ బియ్యాన్ని ఎక్కువగా తింటారు. విద్యార్థులకు తెలంగాణ నేల మీద పండిన బియ్యాన్ని అందిస్తాము. రైతులు నాణ్యమైన సన్నాలు పండిస్తే పేదలకే అందిస్తాము. అయితే పథకాలు అమలు చేస్తున్న విధానం కూడా ప్రజలకు, రైతులకు తెలియాలి. ఇది రాజకీయాలు చేసే సందర్భం కాదు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు ప్రజల్లోకి వెళ్ళాలి. వ్యవసాయం దండగ కాదు పండుగ చేస్తాం అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.