నాకే జనగామ టికెట్ వస్తుంది – ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి

-

తనకే జనగామ టికెట్ వస్తుందని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పేర్కొన్నారు. తరిగొప్పుల మండలంలోని సోలిపురం అంకుశ పురం గ్రామంలో కమ్యూనిటీ భవనాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి..ఈ సందర్భంగా మాట్లాడారు. తరిగొప్పుల మండలానికి నీరు అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎస్టిమేషన్ ఇస్తే 104 కోట్లతో ప్రాజెక్ట్ నిర్మాణానికి మంజూరు చేశారు…ప్రణాళిక సిద్ధం చేసి సాంక్షన్ పూర్తయిన తర్వాత తెలిసి తెలియని కొంతమంది నేనే 80 కోట్లు సాంక్షన్ చేయించినట్టు చంకలు గుద్దుకుంటు ప్రచారం చేస్తున్నారు, ఇది అవమానకరమన్నారు.

Muthireddy Yadagiri Reddy on janagama ticket

ఈ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు…తరిగొప్పుల మండలాలకు చెందిన నాయకులతో, కార్యకర్తలతో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో మీటింగ్ పెట్టడం పార్టీకి విరుద్ధం అంటూ చురకలు అంటించారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పార్టీ టికెట్ వచ్చిందని కల్లబొల్లి ప్రచారం చేస్తున్నాడు…నిజంగా పార్టీ టికెట్ కేటాయిస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే పైనే బాధ్యత అప్పగిస్తుందన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ప్రవర్తించడం పార్టీకి విరుద్ధం..పార్టీ బాధ్యతలు కేవలం ఉద్యమాలు చేసిన వారికే తెలుస్తదన్నారు. భాజాప్త పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికే టికెట్ కేటాయిస్తది…ప్రజలు నన్ను రెట్టింపు మెజారిటీతో గెలిపిస్తారని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version