TSRTC చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

-

TSRTC చైర్మన్ గా ప్రస్తుతం జనగాం ఎమ్మెల్యే  ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇవాళ ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. తనపై నమ్మకంతో ప్రభుత్వం ఆర్టీసీ చైర్మన్ బాధ్యతలు అప్పగించిందని, తన శక్తి మేరకు సంస్థ అభివృద్ధికి పాటు పడుతానని ఆర్టీసీ చైర్మన్ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పేర్కొన్నారు. సంస్థ ఉద్యోగులతో పాటు తాను కూడా సమిష్టిగా పని చేసి ఆర్టీసీ అభివృద్ధికి తోడ్పడుతానన్నారు. టీఎస్ ఆర్టీసీ నూతన చైర్మన్ గా ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తాజాగా బాధ్యతలను స్వీకరించారు. హైదరాబాద్ ఆర్టీసీ భవన్ లోని తన ఛాంబర్ లో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 

ఆర్టీసీ సంస్థల లాభాల బాటలోకి తీసుకెళ్లడంలో తన వంతు  కృషి చేయనున్నట్టు చెప్పారు. టీఎస్ ఆర్టీసీ చైర్మన్ గా తనను నియమించిన సీఎం కేసీఆర్ కు ముత్తిరెడ్డి కి  కృతజ్ఞతలు తెలిపారు. అనుభవజ్ఞులైన ఎండీ సజ్జనార్ నేతృత్వంలో టీఎస్ ఆర్టీసీ అన్ని విభాగాలలో దూసుకుపోతుందన్నారు. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ మరియు ఇతర ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలిపారు. 

Read more RELATED
Recommended to you

Latest news