హరీష్ రావు ఏడుపుకి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి : మైనంపల్లి

-

మా వాళ్లే కొంతమంది పేదలను అడ్డం పెట్టుకుని హైడ్రా పేరుతో రాజకీయం చేస్తున్నారు. కూకట్ పల్లిలో కొంతమందికి కాలేజీలు, పెట్రోల్ బంకులు కూడా ఉన్నాయి అని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. అవి పేదల పేర్లతో నడిపిస్తున్నారు. దీనిపై హైడ్రా కమిషనర్ దృష్టి పెట్టాలి. హైడ్రాపై విషప్రచారంతో తెలంగాణాని అల్లకల్లోలం చేయాలని కేటీఆర్, హరీష్ రావులు చూస్తున్నారు.

దత్తత గ్రామం కోల్గురులో కొన్ని ఇండ్లను బుల్డోజర్లతో స్వయంగా కూల్చేసిన హరీష్ రావు ఇంకా డోజర్లకు అడ్డం పడుకుంటా అని ఆర్టిఫిషియల్ ఏడుపు ఏడుస్తున్నాడు. హైదరాబాద్ లో ముసలి కన్నీరు కాల్చిన హరీష్ రావు మల్లన్నసాగర్ నిర్వాసితుల గోడు నీకు పట్టదా.. హైడ్రా బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న హరీశ్ రావు మల్లన్నసాగర్ నిర్వాసితులకు ఇచ్చిన హామీ నేరవేర్చాలి. హరీష్ రావు మహానటుడు, ఏడుపుకి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి అని మైనంపల్లి అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version