మంత్రి హరీష్ రావు పై సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మల్కాజ్గిరి నుండి తాను, మెదక్ నుండి తన కొడుకు పోటీ చేస్తామని చెప్పారు. మెదక్ అభివృద్ధికి అడ్డుపడింది మంత్రి హరీష్ రావే అని సంచలన ఆరోపణలు చేశారు. అవసరమైతే హరీష్ రావు ప్రాతినిధ్యం వహించే సిద్దిపేటలోనూ తన తడాఖా చూపిస్తానని హెచ్చరించారు.
మెదక్ లో ప్రచారం చేయడానికి హరీష్ రావు ఎవరు..? అని ప్రశ్నించారు. హరీష్ రావును గద్దెదించే వరకు నిద్రపోనని అన్నారు. మెదక్ లో హరీష్ రావు వేలు పెడితే తాను సిద్దిపేటలో పెడతారని హెచ్చరించారు. అయితే మరి కాసేపట్లో బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను సీఎం కేసీఆర్ విడుదల చేయనున్న నేపథ్యంలో మైనంపల్లి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారాయి.