జూపల్లి కృష్ణారావు పై నాగం జనార్దన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు.. నీకు అంత సీన్ లేదు !

-

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఇప్పుడు రసవత్తరంగా మారాయి. ఓవైపు అధికార పార్టీ నుంచి పలువురు నేతలు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలోకి వలస వెళ్తుంటే.. మరోవైపు కొందరూ కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నారు. తాజాగా పొంగులేటి అనుచరుడు తెల్లం వెంకట్రావు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఖమ్మం రాజకీయాలు ఒక తీరుగా ఉంటే. మహబూబ్ నగర్ రాజకీయాలు మరో తీరుగా ఉన్నారు.

ఈ రెండింటి గురించే ఎందుకు చర్చిస్తున్నామంటే ఖమ్మం నుంచి పొంగులేటి.. మహబూబ్ నగర్ నుంచి జూపల్లి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అయితే  తాజాగా నాగం జనార్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలుచేశారు. నాగర్‌కర్నూలులో పార్టీని బతికించా.. పార్టీ నన్ను అదుకోక పోతే ఊరుకుంటానా? కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ని కాదు.. రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్‌ని.. టికెట్ కోసం దరఖాస్తు ఎప్పుడూ పెట్టలేదు.. పార్టీ కార్యకర్తలతో మాట్లాడి దరఖాస్తు విషయం ఆలోచిస్తానని నాగం జనార్ధన్‌రెడ్డి పేర్కొన్నారు.  కొల్లాపూర్‌లో జగదీశ్వర్ రావు పని చేశారు.. సడన్‌గా జూపల్లి వచ్చాడు.. ఆయన వస్తే ఎదో జరిగిపోతుందంట.. జూపల్లికి నాగర్ కర్నూల్, గద్వాల, కొల్లాపూర్ సీట్లు కావాలంట.. జూపల్లి అంత పెద్దోడు ఎప్పుడయ్యాడో నాకు అర్థం కాలేదు అన్నారు నాగం జనార్దన్ రెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Latest news