నేడు నాగార్జునసాగర్‌ రేడియల్‌ క్రస్టు గేట్లు ఎత్తనున్న అధికారులు

-

శ్రీశైలం డ్యామ్ గేట్లు తెరవడంతో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు సాగర్ రేడియల్‌ క్రస్టు గేట్లు తెరవాలని నిర్ణయించారు. ఇవాళ ఉదయం 8 గంటలకు ఈ గేట్లు ఎత్తనున్నారు. ఈ క్రమంలో ప్రాజెక్టు దిగువ భాగంలో ఉన్న ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. ప్రజలెవరూ నదిలోకి వెళ్లవద్దని అప్రమత్తం చేశారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు భారీ వరద పోటెత్తుతుండటంతో ఏ సమయంలోనైనా నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వసామర్థ్యానికి చేరుకుంటుందని తెలిపారు.

నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 590.00(312.505 టీఎంసీలకు) అడుగులకుగాను ప్రస్తుతం 580.40 (284.16 టీఎంసీలకు) అడుగులకు చేరింది. సోమవారం సాగర్‌ క్రస్టు గేట్ల ద్వారా దాదాపు 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదలనున్నారు. మరోవైపు శ్రీశైలం జలాశయం నుంచి 3,69,250 క్యూసెక్కులు, ఏపీ, తెలంగాణ విద్యుత్తు కేంద్రాల ద్వారా 58,461 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు వదులుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ఆదివారం రాత్రి 9 గంటలకు 882.90 అడుగులుగా నమోదైంది.

Read more RELATED
Recommended to you

Latest news