రెండేళ్ల తర్వాత నాగార్జునసాగర్ 20 గేట్లు ఎత్తివేత

-

దాదాపు రెండేళ్ల తర్వాత నాగార్జునసాగర్కు కృష్ణమ్మ పరవళ్లు తొక్కింది. శ్రీశైలం డ్యామ్ నుంచి పోటెత్తుతున్న వరదతో సాగర్కు భారీ ప్రవాహం రావడంతో నిండుకుండలా మారింది. ఈ క్రమంలోనే అధికారులు సోమవారం రోజున నాగార్జునసాగర్ జలాశయం 20 క్రస్ట్ గేట్లు తెరిచారు. 20 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేరకు ఎత్తి.. స్పిల్‌వే ద్వారా లక్షా 96వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు. సాగర్ గేట్లు తెరుచుకోవడంతో సుమారు 22 లక్షల ఆయకట్టు సాగులోకి వస్తోందని పరివాహక ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు

తొలుత కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి.. జలహారతి ఇచ్చి దిగువన ఉన్న ప్రాంతాల ప్రజల అప్రమత్తత కోసం మూడుసార్లు సైరన్‌ మోగించారు.  అనంతరం ఒక్కొక్కటిగా మొత్తం 20 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 584.80 అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది. మరోవైపు పూర్తి నీటినిల్వ సామర్థ్యం 312.5 టీఎంసీలు కాగా… 296.85 టీఎంసీలకు నీరు చేరుకుంది. ప్రస్తుతం జలాశయానికి ఇన్‌ఫ్లో 3,55,305 క్యూసెక్కులు ఉండగా.. నాగార్జునసాగర్‌ ఔట్ ఫ్లో 1,96,027 క్యూసెక్కులుగా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version