నకిరేకల్ లో మూడో సారి చిరుమర్తి లింగయ్య ఎమ్మెల్యే అవుతారని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. నకిరేకల్ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి హరీశ్‌రావు రామన్నపేటలో ఎస్‌టీవో కార్యాలయం ప్రారంభించారు. నకిరేకల్ లో 100పడకల ఆసుపత్రి రూపు దిద్దుకుంటుంది. రాష్ట్రంలో సంక్షేమ పతకం అందని ఇల్లు లేదు.36 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించుకున్నాం.ఛతీస్ ఘడ్ నుండి వ్యవసాయ కూలీలు వచ్చి నాటు వేసి పోతున్నారు.
కాంగ్రెస్ కాలం లో మనవద్ద ఉన్నోళ్లకు పనిలేదు..రైతులకు 24గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్.పండిన పంట గింజ లేకుండా కొనుగోలు చేస్తున్నాం. దేశంలో అత్యధిక పంట పండించే రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రంలో అత్యధిక పంట పండించే జిల్లా నల్గొండ అని తెలిపారు. ఇక్కడ నిమ్మకాయల మార్కెట్, బత్తాయి మార్కెట్ ఏర్పాటు చేసుకున్నాము. కాంగ్రెస్ నాయకులు సిగ్గు లేకుండా కరెంట్ గురించి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి మూడు గంటల కరెంట్ చాలు అంటుండు.
మూడు గంటలు కరెంటు కావాలంటే కాంగ్రెస్ కు ఓటు వేయండి. 24గంటలు కరెంటు కావాలంటే బీఆర్ఎస్ కు ఓటు వేయండి.సంక్షేమ పథకాలు తీసుకున్న ప్రజలంతా కెసిఆర్ వైపే ఉన్నారు.యాభై ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు ఎందుకు చేయలేదు. రెండు నెలల్లో నకిరేకల్ లో వంద పడకల ఆసుపత్రి ప్రారంభం అవుతుంది. బ్రాహ్మణ వెళ్లెంల ప్రాజెక్టు పూర్తి అయ్యింది.. ఉదయ సముద్రం ప్రాజెక్ట్ నుండి త్వరలో కృష్ణా నీళ్లు ప్రవహిస్తాయి. ముఖ్యమంత్రి గారి చొరువతో నకిరేకల్ కు అదనపు నిధులు అందిస్తామని పేర్కొన్నారు మంత్రి హరీశ్ రావు.