సచివాలయంలోని నల్లపోచమ్మ ఆలయ ప్రారంభోత్సవానికి నేటి నుంచి క్రతువులు

-

తెలంగాణ పాత సచివాలయ ప్రాంగణాల్లో ఉన్న ప్రార్థనా మందిరాలను రాష్ట్ర ప్రభుత్వం పునః నిర్మించిన విషయం తెలిసిందే. గతంలో ఆ ప్రాంగణంలో నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయం, రెండు మసీదులు, చర్చ్ ఉండేవి. పాత బిల్డింగ్​ కూల్చివేతల సమయంలో ప్రార్థనా మందిరాలకు నష్టం జరగడంతో ప్రభుత్వ ఖర్చుతోనే వాటిని పునర్నిర్మిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం విదితమే. ఇచ్చిన మాట ప్రకారం.. సచివాలయ ప్రధాన భవన ప్రాంగణం వెలుపల తాజాగా ప్రార్థనా మందిరాలను నిర్మించారు.

ఈనెల 25న ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రార్థనా మందిరాలను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అయితే.. సచివాలయంలోని నల్లపోచమ్మ అమ్మవారి ఆలయం ప్రారంభోత్సవానికి నేటి నుంచి క్రతువులు ప్రారంభం కానున్నాయి. నల్లపోచమ్మ వారిని పున:ప్రతిష్టించడం సహా శివాలయం, అంజనేయస్వామి ఆలయాల ప్రారంభంజరగనుంది. మూడు రోజుల పాటు పూజలు చేస్తారు. ఉదయం గణపతిపూజతో కార్యక్రమం ప్రారంభించాక.. పలు పూజాది కార్యక్రమాలు చేయనున్నారు.

మూడోరోజైన 25వ తేదీన చండీయాగం, దిగ్బలి, ప్రాణప్రతిష్టాపన హోం, ధ్వజస్థంభం, యంత్రప్రతిష్టాపన, విగ్రహాల ప్రతిష్ట, ప్రాణపతిష్ట, మూడు ఆలయాల శిఖర కుంభాభిషేకం, మహాపూర్ణాహుతి, మహా మంగళహారతి, మహాదాశీర్వచనం ఉంటాయి. 25వ తేదీ మధ్యాహ్నం జరగనున్న ప్రధాన పూజాకార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారు.

Read more RELATED
Recommended to you

Latest news