లోన్ యాప్ కేసులో ఛార్జ్ షిట్ ను పరిగణలోకి తీసుకున్న నాంపల్లి కోర్ట్..!

-

లోన్ యాప్ కేసులో ఛార్జ్ షిట్ ను పరిగణలోకి తీసుకుంది నాంపల్లి కోర్ట్. అయితే దేశ వ్యాప్తంగా ఈ లోన్ యాప్ కేసులు సృష్టించిన సంచలనాల గురించి అందరికి తెలిసిందే. ఇక తెలంగాణలో 2020 -21లో నమోదైన 43 ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ లోన్ యాప్ కేసులో దర్యాప్తు చేపట్టింది. ఎన్ బి ఎఫ్ సి నాన్ పెర్ఫార్మింగ్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్న లోన్ యాప్ నిర్వాహకులు.. ఇంట్రెస్ట్ రేట్లు అధికంగా పెంచి లోన్లు లోన్ లు జారీ చేసారు అని ఈడీ పేర్కొంది.

అలాగే లోన్లు జారీ చేసే సమయంలో కస్టమర్ సీక్రెట్ వివరాలు సేకరించారు నిర్వాహకులు సేకరించారు. దాంతో కస్టమర్ల డేటాను మిస్ యూస్ చేసి వారిని హింసించారు. అయితే లోన్ యప్ నిర్వాహకుల వేధింపులకు తాళలేక చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు అని ఈడీ తెలిపింది. అయితే లోన్ యాప్ నిర్వహకులకు చెందిన 346.86 కోట్ల విలువ చేసే ఆస్తులను జప్తు చేశాము. అలాగే నిందితుల ఖాతాల్లో ఉన్న 434 కోట్లు ఫ్రీజ్ చేయగలిగాము అని ఈడీ కోర్టుకు వివరించింది.

Read more RELATED
Recommended to you

Latest news