మాస్ మహారాజ రవితేజకు ఎలాంటి ప్రమాదం జరగలేదు అని యశోద హాస్పిటల్ పేర్కొంది. అయితే తాజాగా హీరో రవితేజకు షూటింగ్ లో ప్రమాద జరిగింది అనే వార్త వైరల్ అయిన ఇషయం తెలిసిందే. తన 75వ సినిమా షూటింగ్ లో భాగంగా రవితేజకు ప్రమాద జరిగింది అని.. దాంతో ఆయన యశోద చేరాడు. అక్కడ రవితేజకు సర్జరీ జరిగింది అంటూ వార్తలు వచ్చాయి.
అయితే ఈ వార్తలు వైరల్ కావడంతో రవితేజకు ఎలాంటి సర్జరీ జరగలేదు అంటూ యశోద హాస్పిటల్ క్లారిటీ ఇచ్చింది. ఆయన కేవలం కండరాల నొప్పితో మాత్రమే యశోదలో చేరాడు. రెండు రోజులు చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యాడు. అంతే కానీ ఎలాంటి సర్జరీ జరగలేదు అని స్పష్టం చేసింది. అయితే ధమాకా సినిమ తర్వాత నుండి వరుస వైఫల్యాలతో కోనసాగుతున రవితేజ.. ఇప్పుడు మళ్ళీ శ్రీలీల హీరోయిన్ గా తన 75వ సినిమా చేస్తున్నాడు. మరి ఇదైనా హిట్ అవుతుందా అనేది చూడాలి.