సిరిసిల్లలో మత్తు పదార్థం బోనోఫిక్స్ కలకలం సృష్టిస్తోంది. చిన్నారుల పాలిట డ్రగ్స్ లా మారింది
బోనో ఫిక్స్. ప్లాస్టిక్ కవర్ లో పెట్టి పీల్చటంతో మత్తు లోకి జారుకున్నాడు. విస్తృతంగా మాయా మత్తు బోనాఫిక్స్ బారిన పడ్డారు చిన్నారులు. సిరిసిల్ల బస్టాండ్ లో బాలుడు బొనోఫిక్స్ వాడుతుండగా పట్టుకున్నారు సిబ్బంది.
బాలుడిని స్టేషన్ కు తరలించిన పోలీసులు. 15 రోజుల క్రితం ఇలాగే బోనొఫిక్స్ సేవిస్తుంటే పట్టుకునే ప్రయత్నం చేశారు. అప్పటికే ఆ బాలుడు పారిపోయాడు. ఈరోజు మళ్ళీ రావటంతో పట్టుబడ్డాడు. చైల్డ్ వెల్ఫేర్ సంస్థకు పోలీసులు సమాచారం ఇచ్చారు. బోనోఫిక్స్ చాలా ప్రమాదకరమని దీనిని తీసుకొన్నట్టయితే హెల్త్ సమస్యలు చాలా తలెత్తుతాయిన వెల్లడించారు.
దీనిని ఎవరైనా సేవించినట్టు అయితే తమకు సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు. బోనోపిక్స్ మరో డ్రగ్ మాదిరిగా మారిందని.. చిన్నారులు ఎక్కువగా దీనిని తీసుకుంటున్నారని.. దీంతో వారి ఆరోగ్యం చిన్న వయస్సులో దెబ్బ తింటుందని.. ఈ ఏజ్ లో చెబితే సరిగ్గా అర్థం కాదని పేర్కొంటున్నారు పోలీసులు.