కోమురవెళ్లి మల్లన్న కల్యాణంలో పోలీసుల నిర్లక్ష్యం

-

కోరిన కోర్కెలు తీర్చే కోర మీసాల కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన మల్లన్న కల్యాణ వేడుక అత్యంత ఘనంగా జరిగింది. మల్లన్న శరణు శరుణు అంటూజయజయద్వానాలతో ఆలయ ప్రాంగణం అంతా మారుమ్రోగిపోయింది. కన్నుల పండువగా జరిగిన కళ్యాణాన్ని తిలకించడానికి భక్తులు బారులు తీరారు. శివ శక్తులు శివాలెత్తి పోయారు. ఒగ్గు పూజారులు ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా మల్లన్న కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.

ప్రభుత్వం తరపున మంత్రులు కొండా సురేఖ, పొన్న ప్రభాకర్ కళ్యాణోత్సవానికి స్వామి వారికి బంగారు కిరీటం పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలను వెండి పల్లెంలో నెత్తిన పెట్టుకొని సంప్రదాయబద్దంగా సమర్పించారు. ఇదిలా ఉండగా..కొమురవెళ్లి మల్లన్న కల్యాణంలో పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. మల్లన్న కల్యాణం ముగించుకొని వెళ్తున్న మంత్రి కొండా సురేఖకు కాన్వాయ్ పెట్టలేదు పోలీసులు. దాదాపు అరగంట పాటు కాన్వాయ్ కోసం వేచి చూసింది మంత్రి కొండా సురేఖ. కాన్వాయ్ రాకపోవడంతో తన సొంతవాహనంలో వెళ్లిపోయింది మంత్రి సురేఖ. పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేసింది మంత్రి కొండా సురేఖ.

Read more RELATED
Recommended to you

Latest news