New Agricultural Colleges in Telangana State: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా వ్యవసాయ కాలేజీలు ప్రారంభం కాబోతున్నాయి. ఆ దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ అలాగే నల్గొండ జిల్లాలలో కొత్తగా వ్యవసాయ కాలేజీలను ప్రారంభించాలని… రేవంత్ రెడ్డి సర్కార్ ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం వ్యవసాయ కోర్సులకు ఉన్న డిమాండ్లను దృష్టిలో పెట్టుకొని… కొత్తగా అదిరిపోయే వ్యవసాయ కాలేజీలను ఏర్పాటు చేయాలని భావిస్తోందట సర్కార్. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపిందట వ్యవసాయ శాఖ. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న స్కిల్ యూనివర్సిటీలో కూడా అగ్రికల్చర్ కోర్సులు పెట్టాలని భావిస్తుందట రేవంత్ రెడ్డి సర్కార్. దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు సమాచారం.