గోషామహల్ లో కొత్త ఉస్మానియా ఆసుపత్రి..!

-

స్పీడ్ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే గోషామహల్ లో కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు సీఎం. మొత్తం 32 ఎకరాల్లో భవనాల నిర్మాణం జరపాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు గాను గోషామహల్‌ పోలీస్ స్టేడియం అలాగే పోలీస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ ల32 ఎకరాల స్థలాన్ని వైద్య ఆరోగ్య శాఖకు బదిలీ చేయాలని సీఎం ఆదేశించారు.

రాబోయే 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఆసుపత్రి నిర్మాణం జరగాలని.. అందుకోసం అనుభజ్ఞులైన ఆర్కిటెక్టులతో డిజైన్లు రూపొందించాలని సూచించారు. అలాగే ఆసుపత్రికి ప్రజలు సులువుగా చేరుకోవడానికి కనెక్టింగ్ రోడ్లను అభివృద్ధి చేయాలని.. నాలుగు వైపులా నుండి ఆసుపత్రికి చేరుకునేలా రోడ్డు డిజైన్ చేయాలని తెలిపారు. ఆసుపత్రికి అవసరమైన అన్ని విభాగాలతో పాటుగా అకడమిక్ బ్లాక్ అలాగే నర్సింగ్ ఉద్యోగులకు హాస్టళ్లు కూడా నిర్మించేలా ఈ ప్రణాళికలు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version