తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. కొత్తగా తెలంగాణ రాష్ట్రంలోకి సెమి డీలక్స్ బస్సులు రాబోతున్నాయి. అయితే ఈ బస్సుల్లో అందరూ టికెట్ కొనాల్సిందే. మహిళలకు ఫ్రీ బస్సు ఉండదన్నమాట. తెలంగాణ రాష్ట్రంలో.. మహిళలకు ఉచితంగా బస సౌకర్యాన్ని తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎన్నికల కంటే ముందే ఆరు గ్యారెంటీలు ప్రకటించిన కాంగ్రెస్.. దానికి తగ్గట్టుగానే ఉచిత బస్సులో అమలు చేస్తుంది.
అయితే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో కొత్త సెమీ డీలక్స్ బస్సులు రాబోతున్నాయట. ఈ బస్సుల్లో మహిళలు టికెట్ కచ్చితంగా కొనాల్సిందేనని అంటున్నారు. మహిళలకు ఉచిత బస్సుతో టికెట్ కొనే వారికి సీటు దొరకడం లేదని… 300 సెమి డీలక్స్ బస్సులను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు తెలంగాణ ఆర్టీసీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక ఈ ఆర్టీసీ బస్సులో ఎక్స్ప్రెస్ టికెట్ ధర కంటే ఐదు నుంచి ఆరు శాతం ఎక్కువ… ఉంటుంది. అంతే కాకుండా డీలక్స్ కంటే నాలుగు శాతం తక్కువగా టికెట్ రేట్స్ ఉంటాయి. ముఖ్యంగా ఈ బస్సుల్లో… మహిళలకు మాత్రం ఫ్రీ లేదు.