శాసనసభ చివరి రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో మాజీ మంత్రి కేటీఆర్ చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో గత కొన్నిరోజులుగా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి మాట్లాడుతూ.. వాటిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడుతున్నరు. కొన్ని విషయాల్లో అందరూ కలిసి పనిచేయాలని కేటీఆర్ అన్నారు. అత్యాచారాలు, సైబర్‌క్రైమ్‌పై ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అత్యాచారాలు చేసిన వారికి త్వరగా శిక్షపడాలన్నారు. బాధితులకు త్వరగా న్యాయం జరుగుతుందనే భరోసా ఇవ్వాలని చెప్పారు.
“సైబర్‌క్రైమ్ బాధితులకు సత్వర న్యాయం అందాలి. సైబర్‌క్రైమ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులు త్వరగా భర్తీ చేయాలి. కేంద్ర చట్టాల విషయంలో రాష్ట్రప్రభుత్వం తన వైఖరి చెప్పాలి. భావవ్యక్తీకరణ స్వేచ్ఛను హరించే చట్టాలు తేవడం మంచిదికాదు. ప్రజల భావవ్యక్తీకరణ స్వేచ్ఛను హరించేలా కొన్ని చట్టాలు వస్తున్నాయి. మా సభ్యులు ఎవరూ వీడియోలు తీయలేదు. అసెంబ్లీలోని కెమెరాలన్నీ స్పీకర్ అధీనంలోనే ఉంటాయి. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిత్వ హననం జరుగుతోంది. ప్రధానులు, సీఎంల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వీడియోలు వస్తున్నాయి.” అని కేటీఆర్ పేర్కొన్నారు.