తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ కోర్సులలో కీలక మార్కులు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. అంతేకాదు వచ్చే సంవత్సరం నుంచి పాలిటెక్నిక్ లో కొత్త సిలబస్ తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది కేసీఆర్ సర్కార్. ఉపాధి అవకాశాలు మరియు విద్యార్థులలో నైపుణ్యం పెంపొందించేలా పాలిటెక్నిక్ కోర్సులలో కొత్త సిలబస్ ప్రవేశపెట్టినందుకు తెలంగాణ రాష్ట్ర అధికారులు సమర్థమవుతున్నారు.
పలు రాష్ట్రాలతో పాటు సింగపూర్, జర్మనీ, అమెరికా, చైనా మరియు యూకే అలాంటి తదితర 24 దేశాలలోని సిలబస్ ను పరిశీలించనున్నారు తెలంగాణ రాష్ట్ర అధికారులు. కొత్త పార్టీల ప్రణాళికను మార్చి 15వ తేదీ నాటికి సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విదేశాలలో కూడా ఉపాధి పొందేలా… కొత్త కోర్స్ తీసుకురానున్నారు. 2024- 2025 నుంచి ఐదేళ్ల పాటు కొత్త కోర్స్ అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే కొత్త కోర్సు రావడంతో విద్యార్థులు కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.