తెలంగాణ సర్కార్ కు రూ.3825 కోట్ల జరిమానా

-

తెలంగాణకు జాతీయ హరిత ట్రైబ్యునల్ భారీ జరిమానా విధించింది. ఘన, ద్రవ వ్యర్థాలు సరిగా నిర్వహించనందున రాష్ట్ర ప్రభుత్వంపై కొరడా ఝళిపించింది రూ.3825 కోట్లు పరిహారం చెల్లించాలని తెలంగాణ సర్కార్ ను ఆదేశించింది. ఈ మొత్తాన్ని వ్యర్థాల ఉత్పత్తి కారకుల నుంచి వసూలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.

ఈ నిధిని రెండు నెలల్లోగా ప్రత్యేక ఖాతాలో జమ చేయాలని, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు పర్యావరణ దిద్దుబాటు చర్యల కోసమే దీనిని వినియోగించాలని ఎన్జీటీ ఆదేశించింది. మురుగు నీటి నిర్వహణ కోసం కొత్తగా శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేయడంతో పాటు ఇప్పటికే ఉన్న వ్యవస్థలను ఆధునికీకరించుకోవాలని సూచించింది. ఘన వ్యర్థాల నిర్వహణ కోసం కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాల ప్రకారం ప్లాంట్లు ఏర్పాటు చేయాలనీ ఆదేశించింది. పర్యావరణ పునరుద్ధరణ పనులను అన్ని జిల్లాలు, నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో నిర్దిష్ట కాలపరిమితిలోగా చేపట్టాలని పేర్కొంది.

ఒకవేళ ఉల్లంఘనలు ఇలాగే కొనసాగితే.. అదనపు జరిమానా విధించే అంశాన్ని పరిశీలిస్తామని ఎన్జీటీ హెచ్చరించింది. ఈ ఉత్తర్వులను అమలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిదేనని స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news