తెలంగాణలో రేపటితో నైట్ కర్ఫ్యూ ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఆసక్తి రాష్ట్ర ప్రజల్లో నెలకొంది. ఇక నైట్ కర్ఫ్యూతో ఏమైనా కేసులు తగ్గాయా అంటే అదీ లేదు. ఇదే విషయాన్ని హై కోర్టు కూడా పదేపదే ప్రస్తావిస్తోంది. నైట్ కర్ఫ్యూతో ఎలాంటి ఉపయోగం లేదని చెప్పుకొస్తోంది.
ఇక ఇదే టైమ్‌లో రాష్ట్రంలో వీకెండ్ లాక్‌డౌన్ గురించి నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే.. ఇప్పటి వరకు హైకోర్టు ఒత్తిడితోనే నైట్ కర్ఫ్యూ కొనసాగుతోంది. మరి ఇప్పుడు హైకోర్టు వీకెండ్ లాక్‌డౌన్ గురించి పదేపదే ఒత్తడి తెస్తోంది. కానీ దీనిపై ప్రభుత్వం మాత్రం స్పష్టత ఇవ్వలేదు.
ఇక పూర్తిస్థాయి లాక్‌డౌన్ పెట్టేది లేదని కేసీఆర్ ప్రకటించారు. కానీ వీకెండ్ లాక్‌డౌన్ గురించి ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు. అంటే ఆయనకు వీకెండ్ లాక్‌పెట్టే ఆలోచన ఉందని మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే చుట్టూ ఉన్న రాష్ట్రాల్లో పూర్తి లాక్‌డౌన్ కొనసాగుతోంది. కాబట్టి వీటి ప్రభావం మన రాష్ట్రంపై స్పష్టంగా ఉంటుంది. అందుకే వీకెండ్ లాక్‌డౌన్ పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక దీనిపై రేపు ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది.