ఊపిరితిత్తులను రక్షించుకోవడానికి తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు..!?

-

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ శరీరంలో ప్రవేశించిన తర్వాత రోగనిరోధక శక్తిని తగ్గించడం, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్స్ పెరిగేలా చేస్తోంది. దీంతో చాలా మంది కరోనా బారిన పడి ప్రాణాలు విడుస్తున్నారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధను చూపాలి. అప్పుడే కరోనా నుంచి తొందరగా కోలుకోగలం. అయితే కరోనా బాధితుల్లో చాలా మంది ఫేస్ చేస్తున్న సమస్యలో ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఏర్పడటం. దీని వల్ల శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. అయితే ఇలాంటప్పుడు ఊపిరితిత్తుల బలోపేతం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం.

ఆహారం
ఆహారం

బీట్‌రూట్..
బీట్‌రూట్‌లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఇది శరీరంలో రక్తం స్థాయిని మెరుగు పరుస్తుంది. బీట్‌రూల్‌లో నైట్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. రక్తం స్థాయి, రక్త ప్రసరణ, ఆక్సిజన్ స్థాయిని పెంచడంలో బీట్‌రూట్ ఎంతో ఉపయోగపడుతుంది. రోజూ బీట్‌రూట్ తినడం వల్ల ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ను తగ్గించి.. దాని పనితీరును మెరుగుపరుస్తుంది.

పసుపు..
మనం ప్రతి వంటకాల్లో పసుపు వాడటం చూస్తుంటాం. పసుపు అనేది యాంటీబయోటిక్‌గా పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీలు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజు పాలలో పసుపు వేసుకుని తాగడం వల్ల రకరకాల ఇన్ఫెక్షన్ల నుంచి మిమ్మల్నీ రక్షిస్తుంది. దీంతోపాటు దాల్చిన చెక్క, లవంగాలు, అల్లం, మిరియాలు, బెల్లం కలిపి కషాయం కూడా తయారు చేసుకోవచ్చు. దీంతో ఊపరితిత్తులు మెరుగుపడటం, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.

మిరియాలు..
మిరియాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. క్యాన్సర్ నివారణకు మిరియాలు మెరుగ్గా పనిచేస్తాయి. ఇందులో పోషకాలు మెరుగ్గా ఉంటాయి. 119 గ్రాముల తీపి ఎర్ర మిరియాల్లో 169 శాతం సీ పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

చిరుధాన్యాలు..
చిరుధాన్యాల్లో మెగ్నీషియం, ఇనుము, రాగి, పొటాషియం మెరుగ్గా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపర్చడంతో ఎంతో ఉపయోగపడతాయి. రోజూ ఆహారంలో చిరుధాన్యాలు ఉండేలా చూసుకోవాలి. ఇందులో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. ఊపిరితిత్తుల్లోని సీఓపీడీలో సెల్యూలర్ విచ్చినం కాకుండా రక్షిస్తాయి. అలాగే ఆపిల్ పండ్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులోని ప్లేవనాయిడ్స్, విటమిన్-సీ క్యాన్సర్‌ను నివారిస్తాయి.

టమాటా..
టమాటాలల్లో లైకోపీన్ అత్యధికంగా ఉంటుంది. ఇది కెరోటినాయిడ్ కణాలను బలపర్చుతుంది. దీంతో ఊపిరితిత్తులు మెరుగ్గా పనిచేస్తాయి. టమాటా తినడం వల్ల ఉబ్బసం తగ్గుతుంది. అలాగే.. తేనే ఆయుర్వేదంలో ఒక భాగం. యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. రోజూ పరిగడపున వెచ్చని నీటిలో తేనే, నిమ్మకాయ వేసుకుని తాగితే.. శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news