ఈనెల 29న రాష్ట్రానికి నితిన్ గడ్కరీ.. కార్యక్రమానికి రాష్ట్ర సర్కార్ ను ఆహ్వానించద్దని నిర్ణయం

-

ఈనెల 29న హైదరాబాద్ కు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ రానున్నారు.రాష్ట్రంలో రూ. 10 వేల కోట్లతో చేపట్టనున్న నేషనల్ హైవే లకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.అయితే ఈ కార్యక్రమానికి రాష్ట్ర సర్కారును ఆహ్వానించద్దని నిర్ణయించినట్లు తెలిసింది.ఈ ప్రోగ్రామ్ కోసం తేదీలు ఖరారు చేయాలని గత కొన్ని నెలలుగా కేంద్ర మంత్రి కార్యాలయం రాష్ట్ర సర్కారును పడుతున్నప్పటికీ ఇక్కడి అధికారుల నుంచి స్పందన లేకుండా పోయింది.దీన్ని సీరియస్ గా తీసుకున్న గడ్కరీ..రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే హైదరాబాద్ టూర్ ఖరారు చేసుకున్నారు.శంషాబాద్ లోని జిఎంఆర్ హెరీనా హోటల్ ఆవరణలోనే శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.

nithin gadkari
nithin gadkari

ఇందులో కేంద్ర ప్రభుత్వ అధికారులు మాత్రమే పాల్గొననున్నారు.అయితే శంకుస్థాపన కార్యక్రమం తర్వాత దానికి దగ్గరలోనే పదివేల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బిజెపి రాష్ట్ర శాఖ ఏర్పాట్లు చేస్తోంది.జన సమీకరణ బాధ్యతలను హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నేతలకు అప్పగించింది.జిహెచ్ఎంసి లోని 47 మంది బీజేపీ కార్పొరేటర్లు ఒక్కొక్కరూ కనీసం వంద మందికి తగ్గకుండా జనాన్ని తరలించాలని సిటీ బిజెపి నిర్ణయించింది.కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇటీవల కార్పొరేటర్ల తో సమావేశమై జన సమీకరణ పై చర్చించారు.

Read more RELATED
Recommended to you

Latest news