తెలంగాణ సాధించుకున్న తర్వాత రాష్ట్రం ఐటీ రంగంలో దూసుకెళ్తోంది. మొన్నటి దాకా ఐటీ సెక్టార్ అంటే కేవలం హైదరాబాద్ పేరు మాత్రమే వినిపించేది. కానీ ఐటీ రంగాన్ని ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాలకు విస్తరించాలన్న ఉద్దేశంతో పలు నగరాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఐటీ టవర్స్ ను ఏర్పాటు చేసి.. స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్, సిద్దిపేట జిల్లాల్లో ఐటీ హబ్ లను ఏర్పాటు చేసింది. తాజాగా నిజామాబాద్ లోనూ ఐటీ టవర్ ను ఏర్పాటు చేసింది.
ఇవాళ నిజామాబాద్ ఐటీ హబ్ ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్న కేటీఆర్.. మొదటగా ఐటీ టవర్.. అనంతరం న్యాక్, మున్సిపల్ భవనం, మినీ ట్యాంక్ బండ్, వైకుంఠ ధామాం వంటి పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్నారు. అనంతరం పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.