‘ఆ బాధను భరించలేను’ అంటూ.. TMC ఎంపీ ఓబ్రియెన్‌ సస్పెన్షన్‌పై వెనక్కి తగ్గిన ఛైర్మన్

-

రాజ్యసభలో టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రియెన్ సస్పెన్షన్ పై హైడ్రామా చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. దిల్లీ సర్వీసుల బిల్లుపై సోమవారం జరిగిన చర్చ సందర్భంగా ఓబ్రియెన్‌ తీరుపై ఛైర్మన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆయనను సభ నుంచి సస్పెండ్‌ చేయాలని కోరుతూ రాజ్యసభా పక్ష నేత పీయూష్‌ గోయల్‌ మంగళవారం తీర్మానం ప్రవేశపెట్టారు. ఓబ్రియెన్‌ ను ఈ పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల మొత్తానికి సస్పెండ్‌ చేస్తున్నట్లు ఛైర్మన్ ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విపక్షాలు ఆందోళన చేయడంతో సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది.

సభ తిరిగి ప్రారంభమైన తర్వాత సస్పెన్షన్‌ తీర్మానంపై ఓటింగ్‌ నిర్వహించేందుకు ఛైర్మన్‌ నిరాకరించారు. ఇప్పుడు ఓబ్రియెన్‌ను సస్పెండ్ చేస్తే.. ఆయన మళ్లీ సభకు హాజరుకాగలరా? ఈ తీర్మానం ఆమోదం పొందితే ఆయన సభకు రాగలరా.. దీని వల్ల ఎలాంటి ఫలితం లేదని అన్నారు. అందువల్ల దూరదృష్టితో ఆలోచించి ఓటింగ్‌కు అనుమతించడం లేదని చెప్పారు. ఈ సభలో సభ్యులపై ఎలాంటి చర్యలు తీసుకున్నా దానికి బాధపడాల్సింది తానేనని.. ఆ బాధను తాను భరించలేనని ధన్‌ఖడ్‌ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news