నిజామాబాద్ లో దారుణం బయటపడింది. స్కానింగ్ సెంటర్లలో మహిళల న్యూడ్ ఫోటోలు, వీడియోలు తీసి దారుణానికి పాల్పడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో స్కానింగ్ సెంటర్ల లో వికృత చేష్టలకు దిగుతున్నారు. నిజామాబాద్ లోని అయ్యప్ప స్కానింగ్ సెంటర్ ఆపరేటర్ బరి తెగించాడు. స్కానింగ్ కు వచ్చే మహిళలు, యువతుల న్యుడ్ ఫోటోలు, వీడియోలు చిత్రీకరణ చేశారట.
న్యూడ్ ఫోటోలతో బాధిత మహిళలకు బెదిరింపులకు దిగుతున్నాడట. ఆ సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ గా మారాయి. దీంతో అయ్యప్ప స్కానింగ్ సెంటర్ కు నోటీసులు జారీ అయ్యాయి. ఇక వివరణ ఇవ్వాలని జిల్లా వైద్య అధికారి ఆదేశించారు. అటు న్యూడ్ ఫోటో ల చిత్రీకరణ పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.