తెలంగాణ రైతులకు షాక్…వరి నాట్లు పూర్తీ అయ్యాకే రైతు బంధు ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైతు బంధు నిధులు ఇప్పట్లో కష్టమేనా-దుక్కులకు సాయం లేనట్టేనా? అంటే అవుననే పరిస్థితులే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. రైతు బంధు నిధులు విడుదల పై ఆర్థిక మంత్రి అద్యక్షతన కమిటీ ఏర్పాటు అయింది. పాత పథకం రైతు బంధు పై అధ్యనయం చేయనుంది ఈ ఆర్థిక మంత్రి అద్యక్షతన కమిటీ.
జులై 15 కమిటీ నివేదిక రానుంది. ఆగస్టులో బడ్జెట్ కూర్పు ఉంటుంది. అంటే… వరి నాట్లు పూర్తీ అయ్యాకే రైతు బంధు నిధులు విడుదల కానున్నాయన్న మాట. కొత్త నిబంధనలతో వచ్చేది ఎవరికీ రానిది ఎవరికీ అంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం నిర్ణయం తో ఆందోళనలో రైతులు ఉన్నారు. అటు తెలంగాణ రైతులకు షాక్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. 12 డిసెంబర్ 2018 నుండి 9 డిసెంబర్ 2023 వరకు రైతులు తీసుకున్న రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి.